Vijayawada: విజయవాడ హెరాయిన్‌ లింకుల వార్తలపై సీపీ ప్రెస్‌నోట్‌

*ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ వ్యాపారం కోసం లైసెన్స్‌ పొందిన వైశాలి *ముద్రపోర్ట్‌ కు చేరిన టాల్కమ్‌ పౌడర్‌ లో హెరాయిన్‌

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 8:19 PM IST
Vijayawada CP B Srinivasulu Released Press Note on News of Vijayawada Heroin Links
X

విజయవాడ హెరాయిన్‌ లింకుల వార్తలపై సీపీ ప్రెస్‌నోట్‌(ఫోటో-ది హన్స్ ఇండియా)

Vijayawada: విజయవాడలోని అడ్రస్‌‌తో హెరాయిన్‌ లింకులున్నట్లు వచ్చిన వార్తలపై నగర సీపీ బి.శ్రీనివాసులు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసారు. చెన్నైలో ఉంటున్న గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలి ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ వ్యాపారం కోసం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి లైసెన్స్‌ పొందారు. 2020లో వైశాలి జీఎస్టీ రిజిష్ట్రేషన్‌ చేసినట్లు నిర్ధారణ అయినట్లు సీపీ ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు. చాలాకాలంగా ఆమె భర్తతో పాటు చెన్నైలో ఉంటున్నారు.

ముద్ర పోర్టుకు చేరిన టాల్కం పౌడర్‌లో ఉన్న హెరాయిన్‌ ఢిల్లీ చేరాల్సి ఉండగా కంటైనర్‌ను గుజరాత్‌లో పట్టుకున్నారని సీపీ ప్రెస్‌ నోట్‌లో వివరించారు. ఐతే లైసెన్స్‌ పొందెందుకు మాత్రమే విజయవాడ చిరునామా వినియోగించారు తప్ప విజయవాడ కేంద్రంగా ఎటువంటి లావాదేవీలు జరగలేదని ప్రెస్‌ రిలీజ్‌ ద్వారా సీపీ స్పష్టం చేసారు. దీనిపై కేంద్ర ఏజెన్సీ‌ డీఆర్ఐ పరిశోధిస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story