గీతం యూనివర్శిటీ అక్రమాలపై విజయసాయిరెడ్డి యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు

గీతం యూనివర్శిటీ అక్రమాలపై విజయసాయిరెడ్డి యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు
x
Highlights

యూజీసీ డీమ్డ్‌ వర్శిటీ నిబంధనలను గీతం ఉల్లంఘించిందన్నారు. 2007 లో డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు యూజీసీ అనుమతి తీసుకుని..2008లో హైదరాబాద్, 2012ల బెంగళూరు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ప్రారంభించిందన్నారు.

గీతం యూనివర్సిటి ఆక్రమాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యూజీసీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. యూజీసీ డీమ్డ్‌ వర్శిటీ నిబంధనలను గీతం ఉల్లంఘించిందన్నారు. 2007 లో డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు యూజీసీ అనుమతి తీసుకుని..2008లో హైదరాబాద్, 2012ల బెంగళూరు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ప్రారంభించిందన్నారు. విశాఖ క్యాంపస్ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికి వచ్చిందని విజయసాయిరెడ్డి తెలిపారు. నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దూర విద్యతో పాటు పలు యూజీసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంగించిన గీతం యూనివర్సిటీ రద్దు చేయాలని కోరారు..

ఇక విశాఖ గీతం యూనివర్శిటీలో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను జీవీఎంసీ అధికారులు గత శనివారం కూల్చి వేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు ఎందుకు కూల్చుతోందో చెప్పడం లేదని యాజమాన్యం అంటోంది. ఈ కూల్చివేతలపై గీతం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories