కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy: కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు.

Arun Chilukuri
Published on: 31 March 2022 7:32 PM IST
Vijayasai Reddys Speech in Rajaya Sabha
X

కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి 

Vijaya Sai Reddy: కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్‌ CM జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడు క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story