విజయసాయిని ఎంపీగా బరిలో దింపాలని జగన్ ఆలోచన.. ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి ఏంటి?

విజయసాయిని ఎంపీగా బరిలో దింపాలని జగన్ ఆలోచన.. ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి ఏంటి?
x
Highlights

Vijayasai Reddy: ఆయన ఆ పార్టీలో జేమ్స్‌ బాండ్. ఇష్యూ ఎక్కడ రైజైనా అక్కడ వాలిపోతారు.

Vijayasai Reddy: ఆయన ఆ పార్టీలో జేమ్స్‌ బాండ్. ఇష్యూ ఎక్కడ రైజైనా అక్కడ వాలిపోతారు. ఖేల్‌ ఖతమ్, దుక్నం బంద్ అనేలా, సమస్యను పరిష్కరించేస్తారు. ట్విట్టర్‌లో పంచ్‌ల మీద పంచ్‌లు కురిపిస్తూ, ప్రత్యర్థిని కుళ్లబొడుస్తారు. ఇప్పుడు సాగర తీరంలో అధినేత మాటకు బాటలు వేస్తున్నారు. అంతేకాదు, త్వరలో ఆయనను పాత పదవిలాంటిదే కొత్త పోస్ట్‌లో చూస్తామట. ఇన్‌డైరెక్ట్‌ ఎలక్సన్స్ నుంచి డైరెక్ట్‌ పోటీకి సై అంటారట. ఇంతకీ ఎవరా జేమ్స్ బాండ్? తీరంలో ఆయన అలజడి ఏంటి?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా..?? విశాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్ 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డిని నిలబెట్టేందుకు డిసైడ్ అయ్యారా..?? పార్టీ ఆంతరంగిక వర్గాలు ఔననే అంటున్నాయి. నిజానికి, గత ఎన్నికల్లోనే విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. 2024లో మాత్రం విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు.

విజయసాయిరెడ్డి విశాఖపట్నం. రెండింట్లో కామన్ వర్డ్ వి వి ఫర్ విజయసాయి, వి ఫర్ విశాఖ. ఇప్పుడు ఈ రెండూ కలగలిసిపోయాయి. విజయసాయి అంటే విశాఖ, విశాఖ అంటే విజయసాయి అన్నంతగా మింగిల్‌ అయిపోయాయన్నది లోకల్‌ టాక్. ఎందుకంటే, రెండేళ్లుగా విజయసాయి కేరాఫ్‌ విశాఖపట్నం. రాబోయే రోజుల్లో మరో అదిరిపోయే విషయం బయటకు రాబోతోందట. ఇదంతా అర్థంకావాలంటే, కొంచెం పాస్ట్, మరికొంత ప్రెసెంట్‌నూ స్టడీ చేసి, ఫ్యూచర్‌ను పసిగట్టాలి. ఇంతకీ ఏంటబ్బా అది.

విశాఖపట్నం. ఆంధ‌్రప్రదేశ్‌‌ నూతన పరిపాలనా రాజధాని. ఇందులో డౌటే లేదు. కేపిటల్ తరలింపు లేటవుతుందేమో కానీ, తరలిపోవడం పక్కా. ఏ క్షణమైనా రాజధాని విశాఖకే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. డేట్ చెప్పను కానీ, విశాఖకు పాలనా రాజధాని రావడం తథ్యమని విజయసాయిరెడ్డి సైతం ప్రకటించేశారు. రాజధాని తరలింపునకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వైసీపీ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. శ్రావణ మాసం మంచి రోజుల్లో విశాఖకు, రాజధాని షిఫ్టింగ్ ఉంటుందని అంటున్నారు. అంటే ఆగస్ట్ నెలలో అన్నమాట.

మరి రాజధానిగా విశాఖకు, విజయసాయికి లింకేంటి అనేగా డౌట్. రాజధానికి, విజయసాయికి లింకు లేకపోయినా, విశాఖకు, విజయసాయికి మాత్రం లింకు వుంది. వుండబోతోంది. ఇంతకీ ఏంటది? సస్పెన్స్ వద్దు, మ్యాటర్‌కు వచ్చేద్దాం. 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చెయ్యబోతున్నారట. అదీ సంగతి. ఇప్పటి వరకు రాజ్యసభ ఎంపీగానే వుంటున్నారు విజయసాయి. రాజ్యసభ లాంటి పరోక్షం వద్దు, ఇక లోక్‌సభలోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యక్షం కావాలనుకుంటున్నారట విజయసాయి రెడ్డి. 2024లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారట.

విశాఖపై మొదటి నుంచీ స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్, అక్కడ నమ్మినబంటు ఉండాలని అనుకుంటున్నారు. అందుకే, విశాఖ ఎంపీగా విజయసాయి రెడ్డిని బరిలో దింపాలనుకుంటున్నారట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం అయితేనేమి, జీవీఎంసీ ఎన్నికలు అయితేనేమి విశాఖ వాసులకు విజయసాయి రెడ్డి ఎంతో చేరువ అయ్యారు.

ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. వైజాగ్‌లో వైసీపీ అద్భుత విజయాలు సాధించడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఎంతో ఉందన్నది, స్థానిక క్యాడర్ మాట. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోనే, వైసీపీ విజయఢంకా మోగించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ గాలి వీచినా, విశాఖ జీవీఎంసీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలను టీడీపీ ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధినాయకుడి వ్యూహం. ఆయన కాంక్షను సాకారం చేసే పనిలో అనేక స్ట్రాటజీలకు పదునుపెట్టారు విజయసాయిరెడ్డి.

లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు సాగర తీరంలోనే పాగా వేశారు విజయసాయిరెడ్డి. వైసీపీని బలోపేతం చేసేందుకు ఫుల్ టైమ్ వర్క్ చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితా నుంచి ప్రతీదీ ఆయన దగ్గరుండి చూశారు. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా ప్రత్యేక ప్రణాళికలతో విజయసాయిరెడ్డి ముందుకు వెళ్లారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోయినా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించారు ఇవన్నీ, ఉక్కు నగరంలో ఫ్యాన్ గాలి బలంగా వీచేందుకు దోహదం చేశాయి.

విశాఖ జిల్లాలో తిరుగులేని ఆధిక్యం సంపాదించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే, 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని నిలబెట్టాలని అనుకుంటున్నారట. వీఎస్‌ఆర్‌ను ఎంపీగా గెలిపించి ప్రతిపక్షాల నోళ్లకు శాశ్వతంగా తాళం వెయ్యాలన్నది జగన్ ఆలోచన అట. విశాఖ ఎంపీగా పోటీ చేయాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విసిరిన సవాల్‌కు ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించి ధీటైన జవాబు ఇవ్వాలనుకుంటున్నారట జగన్.

నిజానికి, విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల వేళనే ఎంపీ విజయసాయి రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది. అయితే మొత్తం ఏపీలో పార్టీ గెలుపు వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్న విజయసాయి రెడ్డి, బిజీ షెడ్యూల్‌లో పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుందని భావించారని టాక్.

ఏదిఏమైనా, 2024 ఎన్నికల్లో మాత్రం విశాఖ సీటుని వీఎస్‌ఆర్‌కే ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది. ఈ లెక్కన చూస్తే, విజయసాయిరెడ్డి పోటీకి దిగడం ఖాయం. మరి ఇప్పటికే ఎంపీగా వున్న ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? మరో చోట అకామిడేట్ చేస్తారా అన్నది చూడాలి.

మొత్తానికి 2024 ఎన్నికల్లో నూతన రాజధాని నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చెయ్యడం ఖాయమంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో విజయసాయి చేసిన వర్క్‌, అందుకు హెల్ప్‌ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి, ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories