Vijayasai Reddy: మాఫియా బాసువి నువ్వే కదా బాబూ

Samba Siva Rao
Published on: 26 May 2021 7:43 PM IST
vijaya sai reddy comments on chandra babu
X

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో 

Vijayasai Reddy: టీడీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర‌శ‌నాస్త్రాలు సంధించారు. డ్రగ్ మాఫియా కోసమే ఆనందయ్య మందును ఆపేశారంటూ శవాలపై పేలాలు ఏరుకునే బాబు గుడ్డ కాల్చి మీదేశారని చెప్పారు. మాఫియాలన్నిటికీ బాసువి నువ్వే కదా బాబూ అని వ్యాఖ్యానించారు. దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. ఆనందయ్య మందును పరీక్షల కోసం ప్రభుత్వం పంపించిందని చెప్పారు. ఫలితాలు రాగానే మందు పంపిణీ మొదలవుతుందని అన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విజయసాయి అన్నారు. కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిందని చెప్పారు. ప్రసవాల విషయంలో ప్రత్యేక చర్యలను చేపట్టిందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story