అచ్చెన్న మాటలు నిజం.. టీడీపీకి మిగిలింది అదే- విజ‌య‌సాయి రెడ్డి

VijayaSai Reddy on Mahanadu: చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ ఫినిష్ అయిపోయిందని చెప్పారు.

Samba Siva Rao
Published on: 27 May 2021 5:26 PM IST
vijaya sai reddy comments on TDP Mahanadu
X

విజయసాయిరెడ్డి ఫైల్ ఫోటో 

VijayaSai Reddy on Mahanadu: తెలుగు దేశం పార్టీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడుపై వ్యంగాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. కరోనా కారణంగా ఇది వర్చువల్ గా జరుగుతోంది. దివంగత ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కనుమరుగయిందని ఆయన అన్నారు. కుప్పంలోనే టీడీపీ కొట్టుకుపోయిన తర్వాత... అచ్చెన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయని అన్నారు. చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ ఫినిష్ అయిపోయిందని చెప్పారు. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే టీడీపీ పరిమితమయిందని అన్నారు. టీడీపీకి ఇప్పుడు జూమ్ మహానాడులే మిగిలాయని ఎద్దేవా చేశారు.

టీడీపీ మహానాడు కొనసాగుతోంది. కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా వర్చువల్‌ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ వర్చువల్‌ మహానాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు దేశ, విదేశాల నుంచి టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ముందుగా ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీలో కరోనా వ్యాప్తి, శాంతి భద్రతలు, పెంచిన పన్నులు, అప్పులు, అదుపులేని ధరలు, పరిశ్రమలపై దాడులు, అమరావతి సంపద విధ్వంసం వంటి అంశాలపై చర్చిస్తున్నారు నేతలు. అలాగే తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం, సంక్షేమానికి కోతలు వంటి అంశాలపై మహానాడులో నేతలు చర్చిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story