లోకేష్‌ సవాల్‌ను స్వీకరించిన విజయసాయిరెడ్డి

లోకేష్‌ సవాల్‌ను స్వీకరించిన విజయసాయిరెడ్డి
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటన చాలా శోచనీయమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విజయసాయి మండిపడ్డారు.

టీడీపీ నేత లోకేశ్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు సిద్ధం. చర్చకు మీరే తేదీ చెప్పండి అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. కుట్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు అంబాసిడర్‌ అని ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని దుయ్యబట్టారు. కుట్రలకు, చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా చంద్రబాబు తన వల్లే అంటారని, అయితే చెడు జరిగితే ఇతరులపై రుద్దే వ్యక్తిత్వం ఆయనదని విజయసాయిరెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories