శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం!

శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం!
x
Highlights

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది.

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప ‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టిటిడి ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

కోవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ ‌మండ‌పం ఆవ‌ర‌ణంలో టిటిడి అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా రూపొందించిన న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేశారు.

పార్వేట ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుప‌ల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోక‌క‌ల్యాణం, క‌రోనా నివార‌ణ కోసం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోనే ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా పార్వేట ఉత్స‌వాన్ని కూడా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన జీయ‌ర్‌స్వాముల‌కు, అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories