అత్యాచార బాధితురాలు మృతి.. చెడిపోయావంటూ ప్రియుడు..

అత్యాచార బాధితురాలు మృతి.. చెడిపోయావంటూ ప్రియుడు..
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో ఈనెల 7న అత్యాచార గురైన బాధితురాలు మృతి చెందింది. బాలికపై మాణిక్యాలరాజు అత్యాచారం చేయడంతో...

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో ఈనెల 7న అత్యాచార గురైన బాధితురాలు మృతి చెందింది. బాలికపై మాణిక్యాలరాజు అత్యాచారం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక విషయాన్ని ప్రియుడు సుబ్రహ్మణ్యంకు తెలిపింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యం అసభ్యంగా మాట్లాడాడు. చెడిపోయావంటూ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇవ్వడంతో దాన్ని తాగిన బాలిక చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మాణిక్యాల రాజు, సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్యాచారానికి గురైన బాలిక మృతిచెందిన ఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రియుడు సుబ్రహ్మణ్యం తన మామయ్యతో జరిగిన విషయాన్ని మొత్తం వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. అత్యాచారం జరిగిన విషయం తనకు చెప్పి బాలిక ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని సుబ్రహ్మణ్యం తన మామయ్యకు వివరించాడు. అందుకే తాను పురుగుల మందు నీరు కలిపి ఇచ్చానని స్కూల్‌కు వెళ్లే సమయంలో తాగాలని తానే చెప్పినట్లు వివరించాడు.

ఈ నెల 7 న రాత్రి ఓ పూజకు వెళ్లిన బాలికను మాణిక్యాలరాజు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తన ప్రియుడు సుబ్రహ్మణ్యంకు చెప్పగా అతడన్న మాటలకు తీవ్ర మనస్థాపం చెందింది. ఆత్మహత్య చేసుకుంటానన్న బాలికకు సుబ్రహ్మణ్యమే స్వయంగా పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. దీన్ని తాగిన బాలిక స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు తర్వాత జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మాణిక్యాల రాజు, సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories