Venkaiah Naidu: అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య

Venkaiah Naidu: అల్లూరి ఆత్మ విశ్వాసం, తెగువ, దేశభక్తి యువతకు ఆదర్శం కావాలి

Rama Rao
Published on: 19 April 2022 1:58 PM IST
Vice President Venkaiah Naidu Visits Alluri Sitarama Raju Birthplace
X

Venkaiah Naidu: అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య

Venkaiah Naidu: విశాఖ పాండ్రంగిలోని అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అల్లూరి ఆత్మ విశ్వాసం, తెగువ దేశభక్తి యువతకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. బర్లపేటలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల దంపతుల విగ్రహాలను వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ఆవిష్కరించారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్ప సత్యాగ్రహం ఉద్యమాల్లో రూపాకుల దంపతుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story