తల్లి మృతదేహంతోనే 4 రోజులు ఉన్న పదేళ్ల కుమారుడు.. నిద్ర పోతోందని భావించి...

Tirupati: దుర్వాసన వస్తోందని మేనమామ దుర్గాప్రసాద్‌కు చెప్పిన శ్యామ్ కిషోర్...

Shireesha
Updated on: 12 March 2022 12:55 PM IST
Very Sad Incident Happened in Tirupati between Mother and Son | AP Live News
X

తల్లి మృతదేహంతోనే 4 రోజులు ఉన్న పదేళ్ల కుమారుడు.. నిద్ర పోతోందని భావించి...

Tirupati: తిరుపతిలో హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. తల్లి చనిపోయిందని తెలియక మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రాజ్యలక్ష్మి అనే మహిళ కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా కుమారుడు శ్యామ్ కిషోర్‌తో కలిసి విద్యానగర్‌ కాలనీలో ఉంటోంది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఆమె లెక్చరర్‌గా పని చేస్తున్నారు.ఈ నెల 8న ఇంట్లో కిందపడిన రాజ్యలక్ష్మి చనిపోయింది.

అమ్మ నిద్ర పోతోందని పదేళ్ల కుమారుడు శ్యామ్‌ కిషోర్‌ భావించాడు. బాలుడు నాలుగు రోజులుగా స్కూలుకు వెళ్లొస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలతో నాలుగు రోజులు గడపడంతో పాటు మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకున్నాడు. అయితే నాలుగు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో.. మేనమామకు విషయం చెప్పారు. ఇంటికి చేరుకున్న అతను.. సోదరి రాజ్యలక్ష్మి మృతేదేహాన్ని గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పదేళ్ల కుమారుడి మానసిక పరిస్థితి బాగాలేదని మేనమామ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story