కువైట్‌లో కడప జిల్లా వాసి వెంకటేష్‌ ఆత్మహత్య

*కువైట్‌ సెంట్రల్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్‌

Rama Rao
Published on: 17 March 2022 12:43 PM IST
Venkatesh Commits Suicide in Kuwait Central Jail | AP News Today
X

కువైట్‌లో కడప జిల్లా వాసి వెంకటేష్‌ ఆత్మహత్య

Kadapa: కువైట్‌లో కడప వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు కువైటీలను చంపిన కేసులో అరెస్ట్ అయిన పిల్లోల్ల వెంకటేశ్ ఖైదీగా ఉన్నాడు. కువైట్ సెంట్రల్ జైలు బ్యారక్ లోనే ఉరివేసుకున్నట్లు జైలు అధికారులు గుర్తించారు. వెంకటేష్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు గ్రామవాసిగా గుర్తించారు. వెంకటేశ్ ఆత్మహత్యకు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా తన భర్త హత్యలు చేయలేదని తన భర్తను విడుదల చేయించాలని వెంకటేశ్ భార్య పోరాటం చేస్తుంది. వెంకటేష్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన భర్తను పోలీసులే అన్యాయంగా ఉరివేసి చంపారని వెంకటేశ్ భార్య స్వాతి ఆరోపిస్తుంది. తన భర్త చివరి చూపైనా దక్కుతుందా అంట ఆవేదన వ్యక్తం చేసింది.

Rama Rao

Rama Rao

Next Story