Venkaiah Naidu: రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: పుష్పగిరి మఠంలో జరిగే మనుమరాలు సుష్మా వివాహానికి హాజరుకానున్న వెంకయ్యనాయుడు

Rama Rao
Updated on: 9 Feb 2022 8:31 PM IST
Venkaiah Naidu Will Visit TTD Tomorrow Morning
X

రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం చేరుకున్న వెంకయ్యనాయుడికి టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఘన స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ఉపరాష్ట్రపతి రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం పుష్పగిరి మఠంలో జరగనున్న మనుమరాలు సుష్మా వివాహంలో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమల కొండపై భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసారు.

Rama Rao

Rama Rao

Next Story