Vinjamur: జై భీమ్ నగర్ కాలనీలో కూరగాయల పంపిణీ

మండల దళిత ఉద్యమనేత వి.సి. కె నియోజకవర్గ నాయకలు వాగాల పెంచలయ్య ఔదార్యం ఎంతో విలువైందని వింజమూరు ఎస్సై బాజిరెడ్డి పేర్కొన్నారు.

S. Srikanth
Published on: 27 April 2020 9:08 PM IST
Vinjamur: జై భీమ్ నగర్ కాలనీలో కూరగాయల పంపిణీ
X

వింజమూరు: మండల దళిత ఉద్యమనేత వి.సి. కె నియోజకవర్గ నాయకలు వాగాల పెంచలయ్య ఔదార్యం ఎంతో విలువైందని వింజమూరు ఎస్సై బాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వింజమూరు పంచాయితీ పరిధిలోని జై భీమ్ నగర్, చింతలపాళెం గ్రామాలలో వాగాల ఆధ్వర్యంలో కూరగాయలను పంపిణీ చేశారు.

జై భీమ్ నగర్ లో జరిగిన కార్యక్రమం ఎస్సై బాజిరెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సుమారు నెలరోజులుగా ఎలాంటి ఉపాధిపనులకు వెళ్ళలేని పరిస్థితి గ్రామాల్లో నెలకొందన్నారు. అనంతరం వాగాల పెంచలయ్య మాట్లాడుతూ... పేదలను ఆదుకునేందుకు తనవంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాడం శ్రీనివాసులు, అరికుంట శ్రీనివాసులు, రామ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story