Vangaveeti Radha Krishna: వంగవీటి రాధ సంచలన ఆరోపణలు

Vangaveeti Radha Krishna: *నా హత్యకు కుట్ర పన్నారు *రెక్కీ కూడా నిర్వహించారు

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 6:30 PM IST
Vangaveeti Radha Krishna Sensational Allegations in Vijayawada
X

వంగవీటి రాధ సంచలన ఆరోపణలు

Vangaveeti Radha Krishna: వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఇటీవల రెక్కీ కూడా జరిగిందని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాబట్టి ఆ విషయం ఇప్పుడు చెప్పలేనని, వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులను అందరూ దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే తాను ప్రజల మధ్యన ఉండే మనిషనని, దేనికీ భయపడే వ్యక్తిని కానని రాధా అన్నారు. ఇక రాధా తండ్రి రంగా వర్ధంతి సభకు ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. వీరు ముగ్గురు గుడివాడ సమీపంలోని కొండలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story