చంద్రబాబుకు మతి భ్రమించింది : ఎమ్మెల్యే వంశీ

చంద్రబాబుకు మతి భ్రమించింది : ఎమ్మెల్యే వంశీ
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోటి రూపాయలతో నూతనంగా...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లుకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీదపడి మతి భ్రమించిందని విమర్శించారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడినని చెప్పుకునే చంద్రబాబుకు రిఫరెండం అనే మాట ఏవిధంగా వాడతారో తెలీదా అని ప్రశ్నించారు.

గతంలో అమరావతి రాజధాని ఏర్పాటుకు రిఫరెండం కోరారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లుండాలని కానీ టీడీపీకి ఒక రాష్ట్రంలో కూడా సరైన సీట్లు లేవు దీన్ని జాతీయ పార్టీ అని ఎలా అంటారని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరగకపోతే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు. దర్యాప్తులో ఎలకను పట్టారో.. పందికొక్కులను పట్టారో త్వరలో తేలుతుందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories