Vallabhaneni Vamsi: చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 9:27 PM IST
Vallabhaneni Vamsi Apologies to Nara Bhuvaneswari
X

Vallabhaneni Vamsi: చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కాగా, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణికి క్షమాపణలు చెప్పారు. భువనేశ్వరిపై పొరబాటున వ్యాఖ్యలు చేశానన్న వంశీ.. తన వ్యాఖ్యలతో ఎవర్నైనా బాధపెట్టి ఉంటే అందుకు సారీ చెప్తున్నానన్నారు.

ఏమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమేనని.. ఆ వ్యాఖ్యలకు బాధపడుతున్నానని వంశీ అన్నారు. తెలుగుదేశం పార్టీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరినే అన్న వంశీ.. ఆమెను అక్కా అని పిలుస్తానని వెల్లడించారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని.. వ్యక్తిగతంగా బాధపడుతున్నందునే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story