సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్

*కోవిడ్ మేనేజ్‌మెంట్ బాగా చేశారని జెన్నిఫర్ అభినందనలు

Rama Rao
Published on: 12 Oct 2022 7:18 PM IST
US Consulate General Jennifer Larson Meets AP CM Jagan | AP News
X

సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ 

Andhra Pradesh: సీఎం వై.ఎస్‌. జగన్‌ను అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా ఆర్థిక ఇబ్బందులున్నా కోవిడ్ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని సీఎంను జెన్నిఫవర్ అభినందించారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూఎస్‌ కాన్సులేట్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం. హరికృష్ణ పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story