Tirumala: తిరుమలలో పర్యటిస్తున్న యూపీ ఐపీఎస్‌ అధికారులు

Tirumala: అయోధ్య రామమందిరంలో ఇంప్లిమెంటేషన్‌ చేసేందుకే పరిశీలన

Rama Rao
Published on: 27 Jan 2022 3:34 PM IST
UP IPS Officers Visits Tirumala | AP News Today
X

తిరుమలలో పర్యటిస్తున్న యూపీ ఐపీఎస్‌ అధికారులు

Tirumala: ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుమలలోని భద్రతా వ్యవస్థను అయోధ్యరామమందిరంలో ఇంప్లిమెంటేషన్‌ చేసేందుకు యూపీ ఐపీఎస్‌ అధికారులు తిరుమలకు వచ్చారు. ఆలయ భద్రతా, బయోమెట్రిక్ తనిఖీలు, నిఘా, సీసీ కెమెరా సర్వేలియన్స్ తదితర సెక్యూరిటీ అంశాలను క్షుణ్ణంగా ఆధ్యయనం చేశారు.

ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు డీఐజీలు సుభాష్ చంద్రదూబే, వినోద్ K సింగ్, నలుగురు ఐపీఎస్ అధికారులు నిన్న తిరుపతికి వచ్చారు. తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టిలతో తిరుపతిలోని పద్మావతి అతిథి భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి తిరుపతి, తిరుమలలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి వివరించారు.

Rama Rao

Rama Rao

Next Story