మంత్రి పేర్నినానికి తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి పేర్నినానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిపై దాడికి యత్నం చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి....
ఏపీ మంత్రి పేర్నినానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిపై దాడికి యత్నం చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. కాళ్లకు దండం పెట్టేందుకు వచ్చి తాపీతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. దీంతో మంత్రి నానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు నిందితుడిపై కేసు నమోదు చేశామన్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. దాడికి పాల్పడింది తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు అని గుర్తించామన్నారు. మద్యం మత్తులో దాడి చేశాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకుంది.
తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి నాని స్పందించారు. తన తల్లి దశదిన కర్మ జరుగుతుండడంతో అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఇంటికొచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి తన కాళ్లపై పడుతున్నట్లు ముందుకు వచ్చి తనపై దాడి చేసినట్లు వివరించారు. ఈ మొత్తం ఘటనలో అదృష్టవశాత్తు తనకు ఏం కాలేదన్న మంత్రి తాను క్షేమంగానే ఉన్నట్లు వివరించారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ
28 Jun 2022 3:04 AM GMTశివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMT