ఈ నెల 17న ఏపీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన

Andhra Pradesh: 21 జాతీయ రహదారుల ప్రారంభం మరో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 8:47 AM IST
Union Minister Nitin Gadkari  Visit to AP on The 17th of This Month
X

ఈ నెల 17న ఏపీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన

Andhra Pradesh: ఈ నెల 17న ఏపీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. 21 జాతీయ రహదారులను ప్రారంభిస్తారని, మరో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 17న తలపెట్టిన సభకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు సోము వీర్రాజు. 64 వేల కోట్ల ఖర్చుతో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని.. ఇందులో అధిక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకోవాలని ఆయన సూచించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రశ్నించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story