శ్రీవారి సేవలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి

Jyothi
Published on: 20 Oct 2022 12:42 PM IST
Union Minister Nirmala Sitharaman In Tirumala
X

శ్రీవారి సేవలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఏపి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తమిళనాడు నుండి దర్శనానికి విచ్చేసిన ఓ తమిళ యువకుడితో ముచ్చటించిన నిర్మలా సీతారామన్ వారికి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. అనంతరం పద్మావతి అతిధి గృహం చేరుకుని అల్పాహారం స్వీకరించారు.

Jyothi

Jyothi

Next Story