Anurag Thakur: లిక్కర్‌ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింకు.. అవినీతిలో ఏపీ నాలుగో స్థానం..

Anurag Thakur: ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 5:49 PM IST
Union Minister Anurag Thakur Slams AP CM Jagan
X

Anurag Thakur: లిక్కర్‌ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింకు.. అవినీతిలో ఏపీ నాలుగో స్థానం..

Anurag Thakur: ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని వీర్రాజు విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై యువత గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీని అభివృద్ధిని చేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని, కాదనే దమ్ముందా? అని వీర్రాజు సవాల్ చేశారు.

ఏపీలో వైన్, సాండ్, ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాతో ఏపీ సర్కార్‌కు లింకులున్నాయని ఆరోపించారు. అవి త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు. గంజాయి మాఫియాతో ఏపీలో యువత నిర్వీర్యం అయిపోతుందన్న ఆయన సీఎం ఇప్పుడైనా మేలుకోని గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని హితవుపలికారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఈ మాఫియాలన్నింటి ఆట కట్టిస్తుందని చెప్పారు. జాతీయస్థాయిలో అవినీతి జరిగే రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story