Amit Shah: ఇవాళ ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

* రాత్రి ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న షా * సదరన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న అమిత షా

Shilpa
Updated on: 13 Nov 2021 1:52 PM IST
Union Minister Amit Shah will Visits Andhra Pradesh Today 13 11 2021
X

ఇవాళ ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక(ఫైల్ ఫోటో)

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాత్రి 7.40 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. తిరుపతిలో బసచేస్తారు.

ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు.

ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.


Shilpa

Shilpa

Next Story