Raghurama Krishnam Raju: రఘురామ లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ

Home Ministry: ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ విద్వేషపూరిత ప్రసంగలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Updated on: 3 July 2021 5:36 PM IST
Union Home Ministry Responds to Raghurama Krishnam Raju Letter | Raghurama Krishnam Raju Today News
X

రఘురామకృష్ణంరాజు (ఫైల్ ఇమేజ్ )

Home Ministry: ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ విద్వేషపూరిత ప్రసంగలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సమాజంలో అలజడి సృష్టించేలా హిందూ మత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణల లేఖపై కేంద్ర హోం శాఖ‌ స్పందించింది.

రఘురామ లేఖ, సునీల్ ప్రసంగాల వీడియోల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను కేంద్రం ఆదేశించింది. ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు తెలపాలని సూచించింది. ఐపీఎస్ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీజీ సునీల్ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ కన్వీనర్‌ వినయ్ జోషి ప్రకటన విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story