Amaravati: అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

Amaravati: అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన
x

Amaravati: అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

Highlights

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 25 బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ (శుక్రవారం) శంకుస్థాపన చేశారు.

రాజధాని నిర్మాణానికి ఊతమిచ్చే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజధానిలోని సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా జరిగిన ఈ శంకుస్థాపన, రాజధాని అమరావతిలో ఆర్థిక మరియు పరిపాలనా కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారేందుకు తొలి అడుగు పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories