Andhra Pradesh: నేడు పొందూరుకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

* కేంద్ర మంత్రికి విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద నిరసనసెగ * స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు

Sandeep Reddy
Updated on: 7 Aug 2021 7:31 AM IST
Union Finance Minister Nirmala Sitharaman Visiting Handloom Stalls in Ponduru Today 07 08 2021
X

విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద నిర్మలా సీతారామన్ (ట్విట్టర్ ఫోటో)

Andhra Pradesh : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ శ్రీకాకుళం ఆముదాల వలస నియోజక వర్గం పొందూరులో పర్యటిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అర్హులైన నేతన్నలకు చెక్కుల పంపిణీ చేస్తారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న నిరసన సెగలు స్వాగతం పలికాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జేఏసీ ప్రయత్నించింది. పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసన తెలిపినా స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కూడా మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిరసనలు ఎదురుకానున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story