Palnadu: దారుణం.. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం

Palnadu: బాలిక పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు

Jyothi
Published on: 21 Feb 2024 11:00 AM IST
Unable to bear the Torture of the Volunteer, the Girl Attempted Suicide in Palnadu
X

Palnadu: దారుణం.. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం

Palnadu: పల్నాడు జిల్లాలో వాలంటీర్ ఆగడాలు వెలుగు చూశాయి. నరసరావుపేట మండలం పాలపాడులో గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న కిట్టు శ్రీకాంత్ రెడ్డి... ప్రేమ పేరుతో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేధింపుల విషయమై వాలంటీర్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో బాలిక ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలికను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. తమ చిన్నారిపై వేధింపులకు పాల్పడిన వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story