శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది సంబరాలు

Srisailam: కన్నుల పండువగా సాగిన స్వామిఅమ్మవార్ల రథోత్సవం

Jyothi
Published on: 3 April 2022 12:26 PM IST
Ugadi is Celebrated In  At Srisailam Mahakshetra
X

శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది సంబరాలు

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాత్సవాల్లో భాగంగా నిర్వహించిన మల్లికార్జునస్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామిఅమ్మవార్ల రథోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమో శివాయ అంటూ భక్తులు చేసిన నినాదాలతో శ్రీశైల మహాక్షేత్రం మార్మోగిపోయింది. శ్రీశైల పురవీధుల్లో కన్నుల పండువగా జరిగిన రథోత్సవంలో ఆలయ ఈవో లవన్న దంపతులు, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరమ శివచర్య స్వామి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, కన్నడ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story