Srisailam: శ్రీశైలంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది ఉత్సవాలు

Srisailam: ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో పెద్దిరాజు

Jyothi
Published on: 1 April 2024 2:33 PM IST
Ugadi festival in Srisailam from 6th to 10th of this month
X

Srisailam: శ్రీశైలంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది ఉత్సవాలు 

Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు , అధికారులు పరిశీలించారు. మరిన్ని చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.

చలువ పందిళ్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటికి ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు పెద్దిరాజు.

Jyothi

Jyothi

Next Story