రూ.50 కోసం గొడవ పడ్డ ఇద్దరు యువకులు

X
Highlights
చిన్నచిన్న తగాదాలు పెరిగి పెద్దవి కావడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ...
Arun Chilukuri21 Jan 2021 10:56 AM GMT
చిన్నచిన్న తగాదాలు పెరిగి పెద్దవి కావడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. పాల ప్యాకెట్ అప్పు విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ మొదలైంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. 50 రూపాయల కోసం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. అప్పు విషయంలో పాలడైరీలో యువకులకు ఘర్షణకు దిగారు. డైరీలో గుమస్తాగా పనిచేస్తున్న యువకుడు బాజీపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలాడు బాజి. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Web Titletwo youth clash for 50 rupees in Sattenapalle
Next Story