Kurnool: కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్

Kurnool: జంట హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 11:55 AM IST
Two TDP Leaders Were Brutally Hacked to Death in Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్

Kurnool: జంట హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జంట హత్యలు సంచలనం రేపుతున్నాయి. పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నేత వడ్డు ప్రతాపరెడ్డి అతని సోదరుడు వడ్డు నాగేశ్వర్రెడ్డిని ప్రత్యర్థులు హత్యచేశారు. గురువారం ఉదయం 7 గంటలకు తమ తమ్ముడి దిన కార్యక్రమాలకు వెళుతున్న సమయంలో వాహనంలో వచ్చిన దుండగులు రెప్పపాటు క్షణంలో అన్నదమ్ములపై దాడి చేసి హత్య చేశారు. వీరి వెంట ఉన్న బంధువులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వొడ్డు వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలపాలు కావడం తో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story