వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు.. టాప్‌ ఎక్కి సహాయం కోసం..

Rajampet: కడప జిల్లా రాజంపేటలో వరద బీభత్సం సృష్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 19 Nov 2021 3:31 PM IST
Two RTC Buses Struck in Flood Water at Rajampet
X

వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు.. టాప్‌ ఎక్కి సహాయం కోసం..

Rajampet: కడప జిల్లా రాజంపేటలో వరద బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. రెండు బస్సుల్లో కలిసి సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో ప్రయాణికులు బస్‌ టాప్‌పైకి చేరుకుంటున్నారు. బస్సు పైకి ఎక్కి సహాయం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో గల్లంతయ్యారు. అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story