తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర విషాదం..అంబులెన్స్‌లో ఇద్దరు మృతి

Telangana and AP Borders: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకున్న వేళ కర్నూలు బోర్డర్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి.

Samba Siva Rao
Updated on: 14 May 2021 6:10 PM IST
Andhra Pradesh Telangana Boarders
X

అంబులెన్సు ఫైల్ ఫోటో 

Telangana and AP Borders: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకున్న వేళ కర్నూలు బోర్డర్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి. ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అంటూ బాధితులు మొరపెట్టుకున్న పోలీసులు కరగలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక ఇద్దరు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. గత రాత్రి ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకటించిన దగ్గర నుంచీ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎత్తున అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఉన్నట్టుండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అప్పటికే హైదరాబాద్ బయలు దేరిన కోవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించిన ఇద్దరు బాధితులు ఊపిరి అందక మృతి చెందారు. దీంతో కర్నూలు సరిహద్దుల దగ్గర తీవ్ర విషాదం నెలకొంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story