విషాదం : రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య

విషాదం : రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య
x
Highlights

కలసి బతకలేకపోతే తనువు చాలించాల్సిందేనా..? తల్లిదండ్రులు నో అంటే ఆత్మహత్యే శరణ్యమా..? ఒక్కరోజులో రెండు ప్రేమ జంటల ఆత్మహత్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి....

కలసి బతకలేకపోతే తనువు చాలించాల్సిందేనా..? తల్లిదండ్రులు నో అంటే ఆత్మహత్యే శరణ్యమా..? ఒక్కరోజులో రెండు ప్రేమ జంటల ఆత్మహత్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు తల్లిదండ్రులు అడ్డు చెప్పడం కారణమైతే.. మరో ప్రేమ జంట ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్నారు. అన్ని ప్రేమ కథల్లానే వీళ్ల ప్రేమకూ తల్లదిండ్రులు నో చెప్పారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించి కొంతకాలంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మరో కొన్ని గంటల్లో వివాహానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతవరకూ అంతా సాఫీగానే సాగిపోయినా ఊహించని విధంగా అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విశాఖ జిల్లాలో విషాదం వెలుగుచూసింది. గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పరవాడ మండలం బోనంగికి చెందిన అభిలాష్‌, నాగిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సింహగిరికాలనీలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. అయితే ఇవాళ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న జంట తెల్లారేలోపే ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్‌ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనూ ఇదే కథ అదే విషాదం తల్లిదండ్రులు వద్దన్నారో, మరే కారణమో తెలీదు కానీ మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడంది. కన్నవారికి కన్నీళ్లను మిగిల్చింది. ఖిలా వరంగల్‌ మండలం నక్కలపెల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు నక్కలపెల్లికి చెందిన సాయికుమార్‌, సిద్దిపేటకు చెందిన యువతిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories