Srikakulam: ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరోకరి పరిస్థితి విషమం

Srikakulam: జీడితోటలో పనిచేస్తున్న వ్యక్తులపై ఎలుగుబంటి దాడి

Jyothi
Published on: 23 March 2024 1:03 PM IST
Two Killed in Bear Attack
X

Srikakulam: ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరోకరి పరిస్థితి విషమం

Srikakulam: ఏపీలో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఎలుగుబంటి ముగ్గురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. జీడి తోటలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. మృతులు అప్పికొండ కూర్మారావు, లోకనాథంగా అధికారులు గుర్తించారు. ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆగ్రహంతో గ్రామస్తులు ఎలుగుబంటిని వెంటాడి కొట్టి చంపారు.

Jyothi

Jyothi

Next Story