కర్నూలు జిల్లాలో వింత ఘటన.. ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం

కర్నూలు జిల్లాలో వింత ఘటన.. ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం
x
Highlights

అవును.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ఇద్దరి మనుసులు కలిశాయి. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. చిన్నానాటి నుంచి మంచి స్నేహితులే కదా అని అందరు లైట్ తీసుకున్నారు. దాంతో ఇద్దరూ ప్రేమాయణం సాగించారు. ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు.

అవును.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ఇద్దరి మనుసులు కలిశాయి. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. చిన్నానాటి నుంచి మంచి స్నేహితులే కదా అని అందరు లైట్ తీసుకున్నారు. దాంతో ఇద్దరూ ప్రేమాయణం సాగించారు. ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. కానీ, కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదు. కలిసి ఉండాలనుకున్నా వారికి పెద్దలు అడ్డు చెప్పడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. అయితే.. ఇక్కడ ఇష్టపడింది ఒక అబ్బాయి, అమ్మాయి కాదు.. ఇద్దరు అమ్మాయిలు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి.. నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన మరో యువతి చిన్నానాటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరూ స్నేహితులు కావడంతో క్లోజ్‌గా ఉంటే ఎవరు అంతగా పట్టించుకోలేదు. వయసు పెరిగే కొద్ది వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహంతో పాటు ప్రేమా చిగురించింది. పెద్దవాళ్లయ్యే సరికి ప్రేమ మరింత ముదిరింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు..

వారిద్దరూ ప్రేమగా ఉండడాన్ని చూసి ప్రశ్నించిన పెద్దలకు షాక్ తగిలింది. ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు వాళ్లు తెలిపారు. దాంతో పెద్దలు వారిని మందలించారు. ఇద్దరిని దూరంగా పెట్టారు. అది తట్టుకోలేకపోయిన ఆ ప్రేమికులు పారిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ నెల 3వ తేదీన ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ వెళ్లిపోయారు. ఇంట్లో నుంచి 50వేలు తీసుకుని మరీ పారిపోయారు.. అంతేకాదు.. తల్లిదండ్రులకు మెసేజ్ కూడా పెట్టారు. అది చూసి కంగారు పడిన ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లల జాడ తెలుసుకోవాలంటూ పోలీసులను వేడుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories