Eluru: పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు మృతి

Eluru: చికిత్స పొందుతూ మృతి చెందిన రామకృష్ణ, విజయ్

Jyothi
Published on: 25 Jan 2024 3:22 PM IST
Two Children Died after Eating Panipuri in Eluru
X

Eluru: పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు మృతి

Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇద్దరు చిన్నారులు పానీపూరీ తిని ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి పానీపూరీ తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారుజామున వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతులు రామకృష్ణ, విజయ్‌లు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి జంగారెడ్డిగూడెం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story