గుండెపోటుతో ఒకేరోజు అన్నాతమ్ముళ్ల మృతి

గుండెపోటుతో ఒకేరోజు అన్నాతమ్ముళ్ల మృతి
x
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరు గుండెపోటుతో చనిపోయారు. ముందుగా అన్నకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. అన్న మారణవార్త...

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరు గుండెపోటుతో చనిపోయారు. ముందుగా అన్నకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. అన్న మారణవార్త వినగానే తమ్ముడు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. గుంటూరు ఫాతిమాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్‌ అబ్దుల్‌ నబీకి మంగళవారం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు.

అన్న మరణవార్తను తట్టుకోలేని తమ్ముడు షేక్‌ దస్తగిరి కూడా గుండెనొప్పితో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు పరీక్షించి దస్తగిరి కూడా కన్నుమూశాడని వెల్లడించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. దస్తగిరి పెయింట్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అబ్దుల్‌ నబీకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దస్తగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నాతమ్ముళ్ల భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories