Tirupati: బీజేపీ, వైసీపీ నేతల మద్య విమర్శలు.. ట్విట్టర్లో పేలుతున్న తూటాలు...

Tweet War Between Vijay Sai Reddy and Somu Veerraju
x

Tirupati: బీజేపీ, వైసీపీ నేతల మద్య విమర్శలు.. ట్విట్టర్లో పేలుతున్న తూటాలు...

Highlights

Tirupati: తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుధ్దం ముదిరింది.

Tirupati: తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుధ్దం ముదిరింది. విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా వ్యంగస్త్రాలు విసురుకుంటున్నారు."మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు ఉప ఎన్నికలో డిపాజిట్లు వస్తే చాలు మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు" అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ తాము రాష్ట్రానికి ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తామని కౌంటర్ ఇచ్చారు.

తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ఏపీ బీజేపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సభలు సమావేశాల్లోనే కాకుండా ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యంగ్యస్ర్తాలు విసురుకున్నారు. "బీజేపీ-జనసేనా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు పదును పెట్టారు. మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు ఉపఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు ఎవరి పాత్రలో వారు జీవించండి చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో స్పందించారు. "మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..! కోర్టులకు చెవిలో పువ్వులు పెడుతూ, వెలుపల మేకపోతు గాంభీర్యం కనబరుస్తూ తిరుగుతున్నప్పటికీ అలీబాబా నలబై దొంగలంతా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారటగా" అంటూ అదే స్థాయిల్ కౌంటర్ ట్వీట్ చేశారు. "తిరుపతి ప్రజలకు మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే లోపల కూరకి ఉపయోగపడతాయి" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు సోము వీర్రాజు. మొత్తానికి ట్వీట్టర్ వేదికగా వైసీపీ, బీజేపీ నేతల మధ్య విమర్శలతో తిరుపతి ఓటర్లు ఉపఎన్నికల్లో ఎవరికి పట్టం కడుతారో అన్నది ఆసక్తి రేపుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories