Tweet War: పేర్నినాని, నాగబాబు మధ్య ట్వీట్‌ వార్

Tweet War: మంత్రి వర్సెస్‌ మెగాబ్రదర్ * ఏపీ ప్రభుత్వం, మెగా కుటుంబానికి మధ్య ట్వీట్ల వార్‌

Sandeep Eggoju
Updated on: 12 April 2021 12:59 PM IST
Tweet War Between Actor Nagababu And AP Minister Perni Nani
X

నాగబాబు & పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Tweet War: వకీల్ సాబ్ మూవీపై ఏపీ ప్రభుత్వం, మెగా కుటుంబానికి మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. ఇది ఓ పాచిపోయిన సినిమా అని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం పట్ల నాగబాబుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఓ ట్వీట్ చేశారు. అసలు ఈ వివాదానికి కారణం ఈ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. మీకేమైంది నాని గారు... మీరు కరోనా వాక్సిన్‌తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని.. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

నాగబాబు ట్వీట్‌కు రీకౌంట్‌ ఇచ్చారు మంత్రి పేర్నినాని. పరోపకారి పాపన్న నాగబాబు గారూ పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్‌కు రాబిస్ వ్యాక్సిన్ చాలా అవసరం.. వెంటనే వెతికి వేయించండి ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుందని అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటానంటూ ఘాటుగా జవాబిచ్చారు.

నాగబాబు ట్వీట్:

మంత్రి పెర్ని నని ట్వీట్:



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story