తుంగభద్ర పుష్కరాలలో పుణ్యస్నానాలకు నిబంధనలు!

తుంగభద్ర పుష్కరాలలో పుణ్యస్నానాలకు నిబంధనలు!
x

Tungabhadra pushkaralau File Photo

Highlights

tungabhadra pushkaralu: తుంగభద్ర పుష్కరాల కోసం ఏపీ దేవాదయ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.

ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకూ తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి. కోవిడ్ కారణంగా పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసే భక్తులకు పలు నిబంధనలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం భక్తుల సెంటిమెంట్ కోసమే ఎలాగైనా పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా పరిస్థితులలో ఇది కష్టసాధ్యమైనా పుష్కరాల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో భక్తులకు కొన్ని నిబంధనలు విధించింది. తుంగభద్రా నది కృష్ణా నదికి ఉపనది. ఎక్కువ భాగం కర్ణాటకలో ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లలో ఎక్కువ శాతం ప్రవహించి.. తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో 16 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కోటి రూపాయల ఖర్చుతో ఆధునీకరిస్తున్నారు.

ఇక తుంగభద్రా పుష్కరాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలు ఇవే..

► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్‌ పూల్స్‌పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది.

► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

► భక్తుల సెంటిమెంట్‌ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు.

► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు.

► వైరస్‌ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories