శ్రీవారి డిపాజిట్ల మళ్లింపు నిర్ణయంపై టీటీడీ యూటర్న్

శ్రీవారి డిపాజిట్ల మళ్లింపు నిర్ణయంపై టీటీడీ యూటర్న్
x
Highlights

శ్రీవారి డిపాజిట్ల మళ్లింపు డెసిజన్‌పై టీటీడీ యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలనే నిర్ణయం పెద్ద ఇష్యూ కాకముందే టీటీడీ హుందాగా...

శ్రీవారి డిపాజిట్ల మళ్లింపు డెసిజన్‌పై టీటీడీ యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలనే నిర్ణయం పెద్ద ఇష్యూ కాకముందే టీటీడీ హుందాగా వెనక్కి తగ్గింది. బాండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిధుల మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి సొత్తును ప్రభుత్వ ఖాజానాకు ఎలా మళ్లిస్తారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. భక్తుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డిపాజిట్లు మళ్లింపు నిర్ణయానికి బ్రేకులేసింది టీటీడీ.

తిరుమల శ్రీవారికి ప్రతీ రోజు కోట్లల్లో కానుకలు వస్తాయి. ఇలా వచ్చిన సోమ్మును బ్యాంకుల్లో 12వేల 500 కోట్లకుపైగా ఫిక్ట్స్‌డ్ డిపాజిట్ చేసింది టీటీడీ. ఆ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీని సేవా ట్రస్టులకు విరాళాలుగా చెల్లిస్తుంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో బ్యాంకులు డిపాజిట్లకు వడ్డీరేట్లను తగ్గించాయి. దీంతో టీటీడీకి ఆదాయం తగ్గిపోయింది.

అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి టీటీడీ ‌ఓ కొత్త నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వ సెక్యూరిటీస్ లో డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువగా వస్తుంది. పైగా అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వానికి సాయం చేసినట్లు అవుతుందని టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చింది. జీవో నెంబర్ 311ని ఉదహరిస్తూ ఈ ఏడాది ఆగస్టు 28న సమావేశమై తీర్మానం కూడా చేసింది. డిసెంబర్ లో ఈ తంతంగాన్ని పూర్తి చేయాలని డిసైడ్ చేసుకుంది.

టీటీడీ చేసిన ఈ తీర్మానం మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇది పరోక్షంగా శ్రీవారి సొమ్ములను ప్రభుత్వ ఖజానాకు మళ్ళించడమేనని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. టీటీడీ నిర్ణయంపై నిరసనలు పుట్టకచ్చాయి. దీంతో టీటీడీ వెనక్కి తగ్గక తప్పలేదు. డిపాజిట్ల మళ్లింపు నిర్ణయం ఐచ్చికమని క్లారిటీ ఇచ్చింది టీటీడీ. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నాయని ఇప్పుడు డిపాజిట్లను కదిలించాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది. దీంతో శ్రీవారి ఖజానాకు సంబంధించిన గందరగోళానికి తెరపడినట్లయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories