Tirumala: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారికి జీతాలు పెంపు..

Tirumala: తిరుమల అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించింది.

Arun Chilukuri
Published on: 9 Oct 2023 4:22 PM IST
TTD Trust Board Takes Crucial Decisions
X

Tirumala: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారికి జీతాలు పెంపు..

Tirumala: తిరుమల అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, కార్పొరేషన్ ఉద్యోగులకు పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ ఉద్యోగులకు ఏటా 3 శాతం జీతాలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది.

కార్పొరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు 18 కోట్లు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story