శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 27న ₹300 దర్శన టికెట్ల కోటా విడుదల

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.

Arun Chilukuri
Updated on: 25 March 2023 8:30 PM IST
TTD to Release Rs 300 Darshan Tickets Release On March 27th
X

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 27న ₹300 దర్శన టికెట్ల కోటా విడుదల

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి 27న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ₹300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం 11గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 29,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story