TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే అన్ని టికెట్లు విడుదల..

TTD News: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు రేపు మంగళవారం విడుదల చేయనున్నారు.

Arun Chilukuri
Updated on: 23 May 2022 8:00 PM IST
TTD to Release Online Arjitha Seva Tickets for August on May 24
X

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే అన్ని టికెట్లు విడుదల..

TTD News: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు రేపు మంగళవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలక్ట్రానిక్ లక్కీ డీప్ విధానంలో సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌ పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవలు, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. అలాగే బుధవారం వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేస్తామని చైర్మన్ వైవీ సుబ్డారెడ్డి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story