TTD: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

TTD: కోవిడ్‌ ఉధృతి తగ్గడంతో దర్శన టికెట్ల కోటా పెంచాలని నిర్ణయం

Rama Rao
Published on: 23 Feb 2022 7:22 AM IST
TTD to Release Additional Special Darshan Tickets for Tirumala Temple
X

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు TTD గుడ్‌న్యూస్‌ చెప్పింది. కోవిడ్‌ ఉధృతి తగ్గడంతో దర్శన టికెట్ల కోటా పెంచాలని నిర్ణయించింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనుంది. అలాగే.. ఆఫ్‌లైన్‌లో 20వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ.

ఇప్పటి వరకూ ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను 12 వేల టోకెన్లు జారీ చేస్తుండగా.. రేపట్నుంచి నుంచి 28 వరకూ అదనంగా రోజుకి 13వేల చోప్పున టిక్కెట్లు జారీ చేయనుంది. అదే విధంగా ఫిబ్రవరి 26 నుండి 28 వరకు అదనంగా రోజుకు 5 వేల చోప్పున సర్వదర్శనం టికెట్లను ఆఫ్‌లైన్ పద్దతి ద్వారా తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అయితే మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300 రూపాయల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను ఇవాళ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.

Rama Rao

Rama Rao

Next Story