శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్ల జారీ..

Tirumala: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Updated on: 31 Oct 2022 6:57 PM IST
TTD to Issue Sarva Darshan Tokens From Today Midnight
X

శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్ల జారీ..

Tirumala: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మంగళ, బుధ,గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. సర్వదర్శన టోకెన్లు అయిపోగానే కౌంటర్లు మూసివేస్తామని, టోకెన్‌ లేనివారూ కొండపైన సర్వదర్శనానికి వెళ్లొచ్చన్నారు. టోకెన్లు క్రమంగా పెంచుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా వేంకటేశ్వరస్వామి వారి దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story