TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌ చేస్తే..

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ఉపయోగపడేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో క్యూఆర్ కోడ్‌ను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు.

Arun Chilukuri
Updated on: 20 Sept 2022 7:30 PM IST
TTD Said Good News to Lord Srivari Devotees
X

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌ చేస్తే..

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు ఉపయోగపడేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో క్యూఆర్ కోడ్‌ను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఇక నుంచి తమ మొబైల్ లోనే తిరుమల సమాచారమంతా అందుబాటులో ఉంటుంది. టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల సమస్త సమాచారం తమ మొబైల్ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో ఒక చోట నుంచి మరోచోటకు ఈజీగా వెళ్లొచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. అంతేకాకుండా వివిధ ఆఫీసుల్లో లభించే సేవలు, సిబ్బంది వివరాలు కూడా తెలుసుకోవచ్చు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story