TTD: ఇవాళ ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఏప్రిల్, మే, జూన్...

TTD: రెండేళ్ల తర్వాత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ...

Shireesha
Published on: 20 March 2022 8:02 AM IST
TTD Releasing Tirumala Arjita Seva Tickets Today 20 03 2022 | TTD Online Tickets
X

TTD: ఇవాళ ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఏప్రిల్, మే, జూన్...

TTD: ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక రెండేళ్ల తర్వాత ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.

ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానంలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. జనరల్ విధానంలో కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

Shireesha

Shireesha

Next Story